![]() |
![]() |

రణ్వీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పటికే రెండు భాగాలుగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ ఫ్రాంచైజీ గురించి తాజాగా ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా నిర్మాత, జియో స్టూడియోస్ అధినేత్రి జ్యోతి దేశ్‌పాండే (Jyoti Deshpande) అభిమానులకు ఒక భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
గతేడాది డిసెంబర్లో వచ్చిన 'ధురంధర్' మొదటి భాగం కేవలం హిందీలోనే విడుదలై రూ.1300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన 'ధురంధర్ 2: ది రివెంజ్' అంతకు మించిన విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.3100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఇండియన్ సినిమా స్థాయిని పెంచాయి. ఈ నేపథ్యంలో నిర్మాత జ్యోతి దేశ్‌పాండే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ధురంధర్ ప్రయాణం ఇంకా ముగియలేదు. ఈ ఏడాది చివరలో ప్రేక్షకులకు ఒక భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం" అని పేర్కొన్నారు.
జ్యోతి చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ధురంధర్ మూడో భాగం (Dhurandhar 3) రాబోతుందా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. లేదా ఈ యూనివర్స్‌లో ఉన్న ఇతర పాత్రలతో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ధురంధర్ సినిమాను చిత్రీకరించిన విధానంపై ఒక భారీ 'బిహైండ్ ద సీన్స్' (BTS) డాక్యుమెంటరీని రూపొందించే అవకాశముందని కొందరు భావిస్తున్నారు. అసలు ఆ సర్ప్రైజ్ ఏంటనేది ఈ ఏడాది చివరిలో రివీల్ కానుంది.
![]() |
![]() |